MLG: రైతుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ధర్నాలు రాజకీయ డ్రామాలేనని కాంగ్రెస్ బీసీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ శనివారం విమర్శించారు. ములుగు క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, బోనస్‌తో అండగా నిలుస్తోందన్నారు. అనవసర ఆందోళనలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని సూచించారు