TG: ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. విమర్శలే ప్రధాన అంశంగా బీఆర్ఎస్ నేతలు ముందుకువెళ్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా? వద్దా? అనేది హరీష్ రావు చెప్పాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, పట్టణాల్లో జరిగిన ఎన్నికల్లో BRS ఓటమి చెందిందన్నారు.