BHPL: స్కంద పురాణం ప్రకారం కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో యమధర్మరాజు పరమశివుని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆయన భక్తికి ప్రసన్నమైన శివుడు తనతో పాటు ఇక్కడే నివసించే వరం ఇచ్చినట్లు విశ్వాసం. దీంతో ఒకే పానవట్టంపై కాళేశ్వర, ముక్తీశ్వర అనే రెండు శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ క్షేత్రం కాలం, మోక్షానికి ప్రతీకగా భక్తుల నమ్ముతారు.