MBNR: మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో అండర్ డ్రైనేజీ పనులకు శనివారం మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ జ్యోతి శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ డోలు మంగమ్మ, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.