TG: పీసీసీ మార్పుపై వస్తున్న వార్తలపై చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుందన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడుతానని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎలా పనిచేస్తున్నానో వారి నేతలకు తెలుసు అని పేర్కొన్నారు. తనపై వచ్చిన వార్తలపై స్పందించవద్దని పార్టీ నేతలకు చెప్పానన్నారు.