SS: స్వచ్ఛ పుట్టపర్తి లక్ష్యంగా మున్సిపాలిటీలో నాలుగు వారాల పాటు నిర్వహించే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం ప్రారంభించారు. గణేష్ సర్కిల్ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు వరకు ఈ పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టారు. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతోనే ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యం సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.