HYD: పంజాగుట్ట నిమ్స్‌లో 2వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం కావడం తెలంగాణ వైద్యరంగానికి గర్వకారణమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందిని ఆయన సన్మానించారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా అవయవ మార్పిడి సేవలు అందిస్తున్నామని, వైద్యులు ఇదే నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యులకు నిమ్స్ ఆదర్శంగా నిలిచిందన్నారు.