AKP: రాంబిల్లిలో 19 స్వచ్ఛ రిక్షాలను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం పంపిణీ చేశారు. గ్రామాల పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమైనదిగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ప్రజల కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.