SRCL: తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న సబ్జెక్టుల బోధన పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రాధా తెలిపారు. తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలో శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. వివిధ సబ్జెక్టులలో బోధించడానికి బోధన సిబ్బంది అవసరమని వివరించారు. ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.