AP: రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయింది. రేపు రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేస్తారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎల్లుండి ఉదయం నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పవన్ పరిశీలిస్తారని వెల్లడించారు.