BPT: పిట్టలవానిపాలెం మండలంలోని పెట్రోల్ బంకుల్లో ‘నో హెల్మెట్-నో ఫ్యూయల్’ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని చందోలు ఎస్సై శివకుమార్ ఆదేశించారు. శనివారం బంకుల వద్ద ఇందుకు సంబంధించిన ప్రచార బోర్డులను ఏర్పాటు చేయించారు. బంక్ సిబ్బంది నిబంధనలను కఠినంగా పాటిస్తేనే వాహనదారుల్లో హెల్మెట్ వాడకం పెరుగుతుందని ఎస్సై సూచించారు.