ADB: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. బోథ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన మల్లెపూల సత్యనారాయణ ఆదిలాబాద్‌లోని మాజీ ఎంపీ నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని సోయం బాపూరావు పేర్కొన్నారు.