NRPT: ఉట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి పూజారి లేక రెండేళ్లుగా తాళం వేసి ఉంది. నిత్య దీప, ధూప నైవేద్యాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గర్భగుడి మూసి ఉండటంతో గేటు బయటే పూజలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ వెంటనే పూజారిని నియమించి నిత్య పూజలు పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.