PPM: గుమ్మలక్ష్మీపురం గ్రంథాలయంలో ప్రత్యేక అధికారి శంకరరావు ఆధ్వర్యంలో శనివారం ‘జన్ భాగిధారీ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన గ్రామాలలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గిరిజనులకు అవసరమైన పథకాలు, సౌకర్యాలపై అవగాహన కల్పించి వాటిని అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.