MBNR: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన కోట్ల అపూర్వ తెలంగాణ రాష్ట్రంలో తొలి ర్యాంకు సాధించింది. 120 మార్కులకు 120 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మురళీధర్, శ్రీలత ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత విద్యాసంస్థల్లో డాక్టర్ చదవాలనే లక్ష్యంతో అపూర్వ కష్టపడి చదివిందని తెలిపారు.