VSP: బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా బొత్స జగదీశ్‌ను నియమించారు. శనివారం గాజువాక బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రోనంకి విజయచంద్రుడు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ లీగల్ సెల్ ఇంఛార్జ్‌గా పతివాడ జయకృష్ణను కూడా నియమించారు. ఓబీసీలు బీజేపీకి మూలస్తంభాలని విజయచంద్రుడు పేర్కొన్నారు.