GDWL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్దకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి మురుగు కూపంగా మారింది. రోడ్డుపై మురుగు నీరు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపర తిరుమలగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు మురుగు నీటిలోనే నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.