VKB: బంట్వారం బస్వాపూర్‌లో సంపూర్ణ మద్యపాన, బెల్ట్ షాపుల నిషేధ తీర్మాన ప్రతిని సర్పంచ్ స్రవంతి శివరాజ్ స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేశారు. గ్రామంలో శాంతిభద్రతలు, కుటుంబాల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.