ASR: డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ పీహెచ్సీ ఆధ్వర్యంలో కిల్లోగుడలో శనివారం ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. ఈ మేరకు శిబిరానికి వచ్చిన వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు అందించారు. బీపీ, సుగర్, నిద్రలేమికి ఆయుర్వేద డా. సాయి ప్రశన్న దొర సూచనలు చేశారు. ఆరోగ్యకరమైన జీవనానికి పౌష్టికాహారం ముఖ్యమన్నారు.