TG: బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్ లు కట్టుకున్నారని మండిపడ్డారు. తాము మూసీని బాగు చేస్తామంటే అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పెడుతామంటే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.