భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెల్లం హరికృష్ణను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం హరికృష్ణ కూడా ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.