ప్రకాశం: తాళ్లూరు మండలం బెల్లంకొండవారి పాలెం గ్రామ సమీపంలో శనివారం APSRTC బస్సు ట్రాలీ ఆటో ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సులో క్షతగాత్రుడిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.