TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని టీటీడీ తరహాలో తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా క్యూలైన్లు క్రమబద్ధీకరణ, హుండీ ఆదాయం, విరాళాలు, లడ్డూ ప్రసాదం తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామన్నారు. తిరుమల తరహాలోనే యాదాద్రికి ప్రత్యేక స్వయంప్రతిపత్తి కలిగిన బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా నిర్ణయాల్లో వేగం పెరుగుతుంది.