GNTR: నెల రోజుల్లో గుంటూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జీఎంసీ కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. శనివారం నాజ్ సెంటర్లో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కాల్వల్లో చెత్త వేసే వారికి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.