AP: బాపట్ల అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 140 మందికి రూ.62 లక్షల విలువైన చెక్కులను అందించారు. పేదల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు వెచ్చిస్తోందని పేర్కొన్నారు.