SKLM: మందస మండలంలోని ఉద్దాన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థానిక ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శనివారం ప్రాంతంలో పర్యటించి ప్రజలకు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే రాంపురం, టీ.గంగువాడ గ్రామాల ప్రజలు పచ్చని పంట భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు.