ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మున్నా’ చిత్రంపై నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కథ నచ్చి సినిమా తీసినా, థియేటర్లో చూశాక తేడా కొట్టిందన్నాడు. అప్పటికే హిట్ అనుకుని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్‌తో..ఇది పెద్ద హిట్ అవ్వదని, యావరేజ్‌గా నిలుస్తుందని ముందే చెప్పానని, చివరికి తాను అన్నట్టే జరిగిందని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.