MDK: గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న నందగోకుల్- ఇస్సానగర్ గ్రామాల మధ్యనున్న బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి, కూలిపోయిన బ్రిడ్జి వద్ద భారీ పైపులను ఏర్పాటు చేసి, వాటిపై మొరం పోసి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేశారు.