PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76) వడదెబ్బతో శనివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొండయ్య ఇంటిలోనే ఉంటూ తీవ్ర ఎండ వేడిమి తట్టుకోలేకుండా, వడదెబ్బతో మృతి చెందినట్లు కుమారుడు మహేష్ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొండయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.