MDCL: మేడ్చల్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేస్తూ అలీప్ 33/11 కేవీ సబ్స్టేషన్లో కొత్త 12.5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను TGSPDCL ప్రారంభించింది. పాత 8 MVA ట్రాన్స్ఫార్మర్ స్థానంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థతో అదనంగా 4.5 ఎంవీఏ సామర్థ్యం పెరిగి అలీప్, ప్రగతి నగర్ ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యలు తగ్గనున్నాయి.