KRNL: ఆదోని శివారు రోషన్ గార్డెన్ ఎదుట శనివారం డ్రైనేజీ కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగు నీరు రోడ్డుపైన ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ప్రధాన కాలువలు ఆక్రమణలకు గురవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. సమస్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.