అనకాపల్లి పట్టణం వేల్పుల వీధి, సీతారామ కళ్యాణమండపం, పార్కు సెంటర్ ప్రాంతాల్లో శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి రహదారులను శుభ్రం చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ లక్ష్మీ తులసి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 20వ తేదీ వరకు కొనసాగిస్తామన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.