BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో శనివారం నిత్యకళ్యాణ వేడుక భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. సుప్రభాత సేవ, అభిషేకాల అనంతరం బేడా మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దివ్య వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.