కర్నూల్ జిల్లాలో ‘తల్లికి వందనం పథకం’ కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేలు ఆర్థికంగా జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ డబ్బులు పొందాలంటే తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉండటం తప్పని సరి అని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది ఆధార్ లింక్ కాకపోవడంతో చాలా మంది అర్హులు నిధులు పొందలేకపోయారు. దీంతో లబ్ధిదారులు బ్యాంకు వెళ్లి లింక్ చేసుకోవాలి.