GDWL: అలంపూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో మిషన్ భగీరథ నీరు సరిగా రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక కౌన్సిలర్ పద్మావతి సుందర్రాజు స్పందించి నీటి ట్యాంకర్ను తెప్పించి సమస్యను పరిష్కరించారు. దీంతో వార్డు ప్రజలు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అక్కడి డ్రైనేజ్ సమస్యను కూడా త్వరలో శాశ్వతంగా పరిష్కరిస్తామని కౌన్సిలర్ తెలిపారు.