ELR: రొయ్యలకు గిట్టుబాటు ధరలు కల్పించి రొయ్యల రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరులో రొయ్యల రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, ఎగుమతి దారులు, మేత తయారీదారులు, దళారులు సిండికేట్ గా మారి రొయ్యల ధరలు తగ్గించి వేసి సాగిస్తున్న దోపిడీని అరికట్టలన్నారు.