W.G: తాడేపల్లిగూడెం (M) నందమూరులో ఉపాధి హామీ పనుల చోట మజ్జిగ, మంచినీళ్లు ఏర్పాటు చేయాలని శనివారం వ్యవసాయ కార్మిక సంఘం (D) ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు కోరారు. అక్కడ శ్రామికులు ఇబ్బంది పడుతున్నారని, సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. పని ప్రాంతాన్ని సందర్శించి శ్రామికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.