AP: జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆస్తుల కోసం సొంత కార్యకర్త దస్తగిరిని చంపారని, పాస్టర్లతో మత విద్వేషాలకు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అధికార దాహానికి తల్లి, చెల్లిని కూడా జగన్ వదల్లేదని, బాబాయ్ హత్యలో తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అమరావతిని దెబ్బతీసి, హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నారని, తోక జాడిస్తే కట్ చేస్తానని హెచ్చరించారు.