NTR: మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన గోటురి జమలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు తోట తిరుపతిరావు జమలమ్మ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బండి బుల్లిబాబు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.