BHPL: వ్యవసాయ భూముల్లో పంట అవశేషాలను కాల్చవద్దని గోరికొత్తపల్లి SI త్రిలోక్ నాథ్ రెడ్డి రైతులకు సూచించారు. పంట అవశేషాల దహనం చేయడం వల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడటంతో పాటు నేల సారవంతం తగ్గుతుందన్నారు. అలాగే భారీ అగ్ని ప్రమాదాలు సంభవించి, ఆస్తి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. పంట అవశేషాలను కాలుస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు.