ఖమ్మం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ పేరుతో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పెనుబల్లి మండలానికి చెందిన వ్యక్తికి ఫోన్ చేసిన దుండగులు బ్యాంక్ అధికారులమంటూ నమ్మబలికి రూ.2.19 లక్షలు కాజేశారు. పలుమార్లు నగదు బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపరిచితుల కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.