SDPT: అక్కన్నపేట మండలం రామవరం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో AEO శ్రీలత ఆధ్వర్యంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరిగింది. జనుము, జీలుగు, పచ్చ పెసల వంటి పంటలను సాగు చేసి పూత దశలో నేలలో కలపడం వల్ల భూసారం మెరుగుపడి నత్రజని శాతం పెరుగుతుందని ఆమె వివరించారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, ఈ పచ్చిరొట్ట ఎరువులను వాడాలని కోరారు.