KKD: తుని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్ళింది. ప్రమాదంలోం లారీ డ్రైవర్, క్లీనర్ లకు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ఈ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.