SRD: కంగి మండలం బోర్గి గ్రామానికి చెందిన భూమప్ప కూతురి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.1,10,000 LOC చెక్కును నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి LOC ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మహారెడ్డి రోషన్ రెడ్డి, సంజీవ్ పాటిల్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.