కోనసీమ: రావులపాలెం మండలం దేవరపల్లిలో రూ.15 కోట్లతో 3.30 ఎకరాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఈ నెల 25న సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.