BDK: బూర్గంపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని పాండవ బస్తీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికై కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సహకారంతో చేపట్టిన ఈ పనులను ఉపసర్పంచ్ గుండె వెంకన్న, వార్డు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో లో వోల్టేజ్ సమస్య తొలిగిపోతుందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.