ASF: రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న గోవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని సిర్పూర్ MLA హరీష్ బాబు కోరారు. ఈ మేరకు శనివారం పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని, VHP నాయకులతో పాటు కలిసి MLA వినతిపత్రం అందజేశారు. లేత వయసులో ఉన్న పశువులను కూడా వధశాలలకు తరలించి, పశువుల సంరక్షణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు.