కోనసీమ: అమలాపురం నియోజకవర్గం సమనస గ్రామం రంగాపురంలో కరికాల భక్త కళ్యాణ మండప నిర్మాణ పనులకు శనివారం స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరి కాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ కళ్యాణ మండపం నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలన్నారు.