PPM: ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. శనివారం తన పర్యటనలో భాగంగా జీఎంవలస మండలం బి.జే.పురం గ్రామపంచాయతీ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించారు.