SKLM: రణస్థలం మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా పలు గ్రామాల్లో తీవ్ర నష్టం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు శనివారం అరటి తోటలను స్వయంగా సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు సమర్పించాలని సూచించారు.